సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న మూడవ సినిమా (SSMB 28) యొక్క న్యూ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్, అమీర్ పేట పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ల నేతృత్వంలో సూపర్ స్టార్ పలు కీలక యాక్షన్ సీక్వెన్సెస్ లో పాల్గొంటున్నారు.
గతంలో జరిగిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ప్రకారం SSMB 28 ఏప్రిల్ లో విడుదల కావలసి ఉంది. కానీ ఆమధ్య జరిగిన ఒక ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతుందని ప్రకటించడం జరిగింది. ఐతే, తాజా బజ్ ప్రకారం, ఒకవేళ ఆగస్టు 11 రిలీజ్ డేట్ మిస్సయితే, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను తీసుకురావాలని భావిస్తున్నారట.
పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.