ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి కూడా అతని బాణీలకే పవర్ స్టార్ ఓటు..?

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 08:38 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్ రీసెంట్గానే విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోతే, రేపే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది.


తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాకు థమన్ బాణీలను సమకూర్చబోతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలకు థమనే మ్యూజిక్ అందివ్వగా, ఇప్పుడు సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాకు కూడా ఆయన సంగీతాన్నే పవన్ కోరుకుంటున్నారని వినికిడి. మరి, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com