తారకరత్నను చూసేందుకు బెంగుళూరు ఆసుపత్రికి హీరో మంచు మనోజ్ వెళ్లారు. తారకరత్న కోలుకుంటున్నారు అని తెలిపారు. తారకరత్నను చూసిన తర్వాత కోలుకుంటాడన్న ఆశ కలిగింది అని అన్నారు. అతను కోలుకోవడం పట్ల వైద్యులు చాలా నమ్మకంగా ఉన్నారుని తెలిపారు. భగవంతుని దయ మరియు అందరి ప్రార్థనలతో అతను త్వరలోనే పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడు అని మంచు మనోజ్ అన్నారు.