శాండల్‌వుడ్ నటుడు మన్‌దీప్ రాయ్ కన్నుమూశారు. ఆదివారం తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72. మన్‌దీప్ రాయ్ గుండెపోటుతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అనేక దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, మన్‌దీప్ 500 చిత్రాలకు పైగా నటించారు. 1981లో మించిన ఊట సినిమాతో శాండల్‌వుడ్‌లోకి ప్రవేశించిన మన్‌దీప్ రాయ్ ఎక్కువగా హాస్య పాత్రల్లో కనిపించారు.