సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.. ఈ మూవీకి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్ ఇచ్చి లాంచనంగా ప్రారంభించారు.. దర్శకుడు సుకుమార్ స్వంత బ్యానర్ సుకుమార్ రైటర్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీ ద్వారా తెలుగమ్మాయి మనీషా రాజ్ హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్నది.. ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా హీరోయిన్ కోసం పలువురికి ఆడిషన్స్ నిర్వహించాడు.. అందులో ఉత్తమ నటన కనబరిచిన మనీషాను హీరోయిన్ గా ఎంపిక చేశారు… ఈ మూవీలో మంచి నటన కనబరిస్తే దిగుమతి హీరోయిన్స్ కు మనీషా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అప్పుడే ఫిల్మ్ నగర్ టాక్..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa