కళాతపస్వి శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ గారు నిన్న రాత్రి శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు వారి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతికి చింతిస్తూ, ఆయన గౌరవ సూచకంగా ఈ రోజు మధ్యాహ్నం 02:14 నిమిషాలకు ఎనౌన్స్ చెయ్యాల్సిన 'ఏజెంట్' అప్డేట్ ను రేపటికి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.