రంజిత్ జెయకోడి దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్నటించిన 'మైఖేల్' మూవీ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం.
దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రం 'మైఖేల్'లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తుంది.