పాన్ ఇండియా భాషల్లో ఈరోజు గ్రాండ్ గా విడుదలైన చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకొడి డైరెక్షన్లో పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌషిక్ హీరోహీరోయిన్లుగా నటించారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ కీరోల్స్ లో నటించారు.
తాజాగా మైఖేల్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ పై అఫీషియల్ క్లారిటీ వస్తుంది. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్ ను బట్టి, మైఖేల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటిటి ఆహా సంస్థ చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాను భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.