నందమూరి కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ లో కనిపించబోతున్న సినిమా "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సప్తగిరి కీరోల్స్ లో నటిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు సాయంత్రం ఐదు గంటల నుండి హైదరాబాద్ JRC కన్వెన్షన్స్ లో అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హాజరు కాబోతున్నారన్న విషయం తెలిసిందే.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అమిగోస్ మూవీ ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa