చిత్రం : మాయాపేటిక
గానం : యశస్వి కొండేపూడి, ప్రజ్ఞ నయని
సాహిత్యం : శ్రీమణి
సంగీతం : గుణ బాలసుబ్రమణియన్
పల్లవి :
షన్న షన్న మేరీ షన్న షన్న
బానే ఉన్న నేను నిన్న మొన్న
నేడే ఏదో మాయ నీ వల్లేనా
అయిపోయానే దీవానా
షన్న షన్న మేరీ షన్న షన్న
బానే ఉన్న నేను నిన్న మొన్న
మానేసానా కాన పీనా సోనా
అయిపోయానే దీవానా
అందాల షాయరీలే గుల్కుంద్ కవితలే
ఎన్నెన్ని వెదజల్లింది చరవాణి
గులాబి అత్తరల్లే నీ అక్షరాలు జల్లే
ఈ మైకం చాలంటుంది జిందగానీ
చందమామే అనుకున్న
కాదు నువ్వని తెలిసినదే
ఎవరు లేని హృదయానా
మొదటి టెన్ టు ఫైవ్ ప్రేమే
ఇలా ఎలా భలే భలే కలిసినది
షన్న షన్న మేరీ షన్న షన్న
బానే ఉన్న నేను నిన్న మొన్న
నేడే ఏదో మాయ నీ వల్లేనా
అయిపోయానే దీవానా
కలకననీ నిజమిదిలే
వినబడనీ స్వరమిదిలే
కాలి గంగుర్ల చప్పుళ్ళు నే దాచెనే
కాని ముంగురులు మనసేంటో వివరించెనే
సూఫీలో సంగీతాలే
సాఫీగా పెదవే పాడే
బర్ఫీల మనసే చిందులాడే
నీ నీడే నాకే తోడై
వెన్నెల్లో హృదయం ఆడే
ఎన్నెన్నో సంతోషాలు జతకూడే
అంతేలేని మౌనం అయినాగాని ప్రాణం
తరగని కబురులు చిలికెను చెలితోనా
షన్న షన్న మేరీ షన్న షన్న
బానే ఉన్న నేను నిన్న మొన్న
నేడే ఏదో మాయ నీ వల్లేనా
అయిపోయానే దీవానా