కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారి కెరీర్ లో 125వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం "వేద". రీసెంట్‌గానే కన్నడలో విడుదలై, ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో ఈనెల 9న విడుదల కాబోతుంది. A హర్ష డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో గానవి లక్ష్మణ్ హీరోయిన్ గా నటించింది. అర్జున్ జన్య సంగీతం అందించారు. గీత పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై గీత శివరాజ్ కుమార్ నిర్మించారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో వేద ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని, ఈ ఈవెంట్ కి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు తెలుపుతూ కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.