కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారి కెరీర్ లో 125వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం "వేద". రీసెంట్గానే కన్నడలో విడుదలై, ఘనవిజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా అదే టైటిల్ తో ఈనెల 9న విడుదల కాబోతుంది. A హర్ష డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో గానవి లక్ష్మణ్ హీరోయిన్ గా నటించింది. అర్జున్ జన్య సంగీతం అందించారు. గీత పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై గీత శివరాజ్ కుమార్ నిర్మించారు.
పోతే, ఈ నెల 10 నుండి పాన్ ఇండియా భాషల్లో వేద మూవీ జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కి రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. మరి, డిజిటల్ ప్రీమియర్ కి ఒక రోజు ముందుగా ఈ సినిమాను తెలుగులో థియేటర్లలో విడుదల చెయ్యడం వెనుక ఉన్న ఆంతర్యం మేకర్స్ కే తెలియాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa