కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి". నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి రీసెంట్గానే తమిళ ఆడియో ఆల్బమ్ విడుదలైంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ నెల 8వ తేదీన అంటే మరో రెండ్రోజుల్లో సార్/ వాతి ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొంటూ కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa