విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. కోలీవుడ్, టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాడు. అయితే అతన్ని మాత్రం పాన్ ఇండియా స్టార్ అంటే ఫైర్ అవుతున్నాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను కేవలం నటుడిని మాత్రమే. దయచేసి నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి. ఆ ట్యాగ్ నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. అన్ని భాషల్లో నటించాలనుకుంటున్నాను. ఎక్కడ అవకాశం వచ్చినా వెళ్లి నటిస్తాను' అన్నారు.