నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచిన రీసెంట్ మూవీ "బింబిసార". గతేడాది ఆగస్టు 5న విడుదలైన బింబిసార టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కొత్త దర్శకుడు వసిష్ఠ రూపొందించిన ఈ సోసియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ గతంలోనే ప్రకటించగా, తాజాగా ఆ విషయంపై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం తాను చేస్తున్న "డెవిల్" మూవీ 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని, ఆపై వసిష్ఠ తో కలిసి ఆల్మోస్ట్ ఈ ఏడాది చివర్లోపు బింబిసార సీక్వెల్ పై వర్క్ స్టార్ట్ చేస్తామని.. కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa