నిన్న సాయంత్రం విడుదలైన సార్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. బర్నింగ్ సోషల్ ఇష్యూకి అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి రూపొందించిన ఈ సినిమా యొక్క ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలను రెట్టింపు చేసింది. యూట్యూబ్ లో #1 ట్రెండింగ్ పొజిషన్లో దూసుకుపోతూ ఇప్పటివరకు 1.7 మిలియన్ వ్యూస్ ని, 100కే లైక్స్ ని రాబట్టింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈనెల 17న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa