ట్రెండింగ్
Epaper    English    தமிழ்

F3 లో రవితేజ ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 23, 2019, 07:50 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' .. సంక్రాంతి పండుగకి బరిలోకి దిగి తన సందడిని కొనసాగిస్తూనే వుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ప్రాంతాల్లో పాత రికార్డులను తిరగరాస్తూ వెళుతోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ ల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఒక వేదికపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ 'ఎఫ్ 3' ఉంటుందని అన్నాడు.

ఇప్పుడు ఈ విషయాన్ని గురించిన వార్తే ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతోనే 'ఎఫ్ 2' కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రానుందని అంటున్నారు. అయితే కొత్త మార్పు ఏంటంటే ఈ ఇద్దరికీ రవితేజ తోడు కానున్నాడని అంటున్నారు. 'రాజా ది గ్రేట్' తరహాలోనే ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్ర నుంచి కూడా నాన్ స్టాప్ నవ్వులు పూయించడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa