ట్రెండింగ్
Epaper    English    தமிழ்

UK షెడ్యూల్‌ను ముగించిన మెగా హీరో 'గాందీవధారి అర్జున'

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 13, 2023, 06:40 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'గాందీవధారి అర్జున' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ మరియు మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ స్పై థ్రిల్లర్ సినిమా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వివిధ ప్రదేశాలలో భారీ షెడ్యూల్‌ను ముగించినట్లు సమాచారం. తదుపరి కీలక షెడ్యూల్ కోసం యూనిట్ ఇప్పుడు యూరోపియన్ కు వెళ్లనుంది. ఆ తర్వాత షూటింగ్ న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సమ్మర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాలో వరుణ్ సరసన జోడిగా సాక్షి వైద్య కనిపించనుంది. విమలా రామన్, నాజర్ మరియు వినయ్ రాయ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ అండ్ బాపినీడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa