బాలీవుడ్ ప్రేమపక్షులు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ క్రిటిక్, నటుడు KRK తాజాగా చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది. కియారా పెళ్లి కాకముందే గర్భవతి అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీంతో ఇప్పటివరకు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించని ఈ జంట సడెన్‌గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే అయ్యి ఉంటుందని కొందరు, అవన్నీ కట్టుకథలని మరికొందరు అంటున్నారు.