కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "సార్ / వాతి". మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా యొక్క తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఐదింటి నుండి హైదరాబాద్, పీపుల్స్ ప్లాజాలో జరగనుంది. ఈవెంట్లో బోలెడన్ని సర్ప్రైజ్ లు ఉన్నాయని చెప్పి ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది చిత్రబృందం.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa