కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన మొదటి వెబ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'రానా నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా కనిపించనున్నారు.
తాజగా ఇప్పుడు ఈరోజు సాయంత్రం ముంబైలో రానా నాయుడు ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ అన్ని ఏర్పాట్లు చేసింది. తాజా సమాచారం ప్రకారం, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలోని ఒక ప్రసిద్ధ 5 స్టార్ హోటల్‌లో సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది అని సమాచారం.
ఈ తెలుగు క్రైమ్ డ్రామా సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై, రాజేష్ జైస్ మరియు ప్రియా బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామాని లోకోమోటివ్ గ్లోబల్ మీడియా LLPకి చెందిన సుందర్ ఆరోన్ నిర్మిస్తున్నారు.