తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులకు ఈ రోజు నుండే తన క్లాసులను ఇవ్వడం షురూ చేసిన "సార్ /వాతి" సూపర్ పాజిటివ్ రివ్యూలతో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద బిగ్ నంబర్స్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.
సార్ మూవీ యొక్క డిజిటల్ మరియు శాటిలైట్ పార్ట్నర్స్ పై అఫీషియల్ గా క్లారిటీ వస్తుంది. ఈ మేరకు సార్ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్, శాటిలైట్ రైట్స్ ప్రముఖ బుల్లితెర ఛానెల్ జెమినీ టీవీ చేజిక్కించుకున్నాయని తెలుస్తుంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.