మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న కొత్త చిత్రం "రామబాణం". తనకి బాగా అచ్చొచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ ఈ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ఖుష్బూ సుందర్ కీరోల్ లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా కాసేపటి క్రితమే రామబాణం మేకర్స్ ఎక్జయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో గోపీచంద్ విక్కీ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుపుతూ ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. రేపు మరొక సర్ప్రైజింగ్ అప్డేట్ రాబోతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa