పాన్ ఇండియా భాషల్లో ఫిబ్రవరి 3న విడుదలైన యంగ్ హీరో సందీప్ కిషన్ న్యూ మూవీ "మైఖేల్". ఇందులో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటించారు. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుండి యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
ఐతే, విడుదలైన మూడు వారాల వ్యవధిలోనే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఈ నెల 24న ఆహా ఓటిటిలో మైఖేల్ మూవీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతుందని అధికారిక ప్రకటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa