టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ మరియు గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'పులి మేక' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. పంతం ఫేమ్ కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 24, 2023న ZEE5లో ప్రీమియర్ అవుతుంది.
నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ థ్రిల్లర్ సిరీస్ యొక్క టీజర్ ని డిజిటల్‌గా విడుదల చేయగా, మూవీ మేకర్స్ ఈ రోజు లావణ్య పాత్రను హీరోయిక్‌గా స్థాపించే ప్రత్యేక వీడియో గ్లింప్సె ని విడుదల చేసారు. కిరణ్ ప్రభ అనే ఐపీఎస్ అధికారిణిగా ఈ సిరీస్ లో లావణ్య కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ థ్రిల్లర్ సిరీస్ పులి మేకలో సుమన్, సిరి హనుమంతు, రాజా చెంబోలు మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ZEE5 ఈ సిరీస్‌ని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa