ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షెహజాదా పరిస్థితేంటి..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 05:17 PM

టాలీవుడ్ సూపర్ హిట్ 'అల వైకుంఠపురంలో' హిందీ రీమేక్ 'షెహజాదా' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ తో రన్ ఐన ఈ సినిమా బాలీవుడ్ లో ఇదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందనుకుంటే, సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. షెహజాదా మేకర్స్ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ఇస్తేనే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 7 కోట్లను రాబట్టగలిగింది. ఇక, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పఠాన్ సృష్టిస్తున్న కలెక్షన్ల సునామి, రికార్డుల పర్వం గురించి తెలిసిందే. ఈ సినిమాను తట్టుకుని నిలబడడమే చాలా కష్టం అనుకుంటుంటే, మార్వెల్ స్టూడియోస్ వారి 'యాంట్ మాన్' కూడా తోడు కావడంతో, ఈ రెండు సినిమాల మధ్య షెహజాదా శాండ్విచ్ అయిపోతుంది. మరి, ఈ రోజు మహాశివరాత్రి, రేపు ఆదివారాలలోనైనా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టాలని ఆశిద్దాం. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa