గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఒటిటి ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ఈ బిగ్గీ తన ప్లాట్‌ఫారమ్‌లో ఫిబ్రవరి 23, 2023న సాయంత్రం 6 గంటల నుండి ప్రీమియర్‌కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాం బాలయ్య అభిమానుల కోసం ప్రత్యేక మ్యూజికల్ ట్రీట్‌ను ప్లాన్ చేసింది. దీనిని రేపు సాయంత్రం 7 గంటలకు ఆవిష్కరించనున్నారు. OTT ప్లాట్‌ఫాం సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరుపై అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa