రేపు ఉదయం 11:34 నిమిషాలకు అల్లరి నరేష్ నటిస్తున్న న్యూ మూవీ "ఉగ్రం" టీజర్ విడుదల కాబోతుందని ప్రకటించిన మేకర్స్ తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు రేపు ఉదయం పదింటి నుండి AMB సినిమాస్ స్క్రీన్ -1 లో ఉగ్రం టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, ఈవెంట్ కి అక్కినేని నాగచైతన్య చీఫ్ గెస్ట్ గా హాజరై, ఉగ్రం టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన గ్రాండ్ రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa