ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గేమ్ ఆన్ టీజర్..రియల్ టైం సైకలాజికల్ థ్రిల్లర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2023, 05:30 PM
కాసేపటి క్రితమే 'గేమ్ ఆన్' టీజర్ విడుదలయ్యింది. యంగ్ సెన్సేషన్ విశ్వక్ సేన్ గేమ్ ఆన్ టీజర్ను లాంచ్ చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు.

ఇక, టీజర్ విషయానికొస్తే, ఈ సినిమా ఒక రియల్ టైం సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిందని టీజర్ ను బట్టి తెలుస్తుంది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ప్రేమ, మోసం, సైకాలజిల్, ఎమోషనల్  గా సాగే గేమ్ లో విజయం కోసం హీరో చేసే పోరాటమే ఈ సినిమా. 

గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ సినిమాను దయానంద్ డైరెక్ట్ చేసారు. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మధుబాల, ఆదిత్య మీనన్ కీరోల్స్ లో నటిస్తున్నారు.

 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa