అరివళగన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ 'బోర్డర్' సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఫిబ్రవరి 24, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది అని మూవీ మేకర్స్ గతంలో ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం కొన్ని తెలియని కారణాల వల్ల మార్చి 2023కి వాయిదా వేయబడింది అనే వార్తను మూవీ మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన నోట్‌ను కూడా విడుదల చేశారు.
ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా మరియు స్టెఫీ పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు. ఆల్ ఇన్ పిక్చర్స్ విజయ్ రాఘవేంద్ర ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa