నటి అనీషా ఆంబ్రోస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత నెల గుణ జక్క అనే వ్యక్తితో రహస్యంగా ఆమె నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలిసింది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగినట్లు సమాచారం. 'రహస్యంగా నిశ్చితార్థం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే వచ్చారు. మరికొన్ని నెలల్లో ఇద్దరి వివాహ వేడుక జరగబోతోంది' అని సన్నిహితులు చెప్పారట. నిశ్చితార్థంలో తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైజాగ్‌కు చెందిన అనీషా 'అలియాస్ జానకి' సినిమాతో 2013లో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'గోపాల గోపాల', 'మనమంతా', 'ఒక్కడు మిగిలాడు' తదితర సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది ఆమె నటించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా విడుదలైంది. అనీషా కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లోనూ నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa