అక్కినేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ 'ఏజెంట్'. ఇప్పుడు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయబోతుంది. ఈ నేపథ్యంలో రాత్రి 07:03 నిమిషాలకు ట్విట్టర్ స్పేస్ లో ఏజెంట్ ఫస్ట్ సింగిల్ 'మళ్ళీ మళ్ళీ' అనే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ నిన్న సాయంత్రం ప్రోమో విడుదల చేసిన మేకర్స్ తాజాగా స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa