ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ డైరెక్టోరియల్ లో రూపొందిన చిత్రం "కోనసీమ థగ్స్". ఈ సినిమాలో బాబీ సింహ, హ్రిదు హరూన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సామ్ CS సంగీతం అందిస్తున్న ఈ సినిమాను HR పిక్చర్స్, జిఓ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై రియా శిబు, ముంతాస్ M నిర్మిస్తున్నారు.
ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదల కాబోతుంది. సెన్సార్ బృందం నుండి యూ/ ఏ సెర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2గంటల 2 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న విషయం తెలిసిందే.