మాస్ రాజా రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "మిరపకాయ్". దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన ఈ ఫన్ యాక్షన్ ఎంటర్టైనర్ 12 జనవరి, 2011లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. విడుదలై, పుష్కరకాలం గడుస్తుండడంతో ఈ ఏడాది జనవరి 26కి మిరపకాయ్ సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చెయ్యాలని తలంచగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 24కి వాయిదా పడింది. సో, రేపే ఈ సూపర్ హిట్ మూవీ మరోసారి థియేటర్లకు రాబోతుంది. మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది.