టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తన తదుపరి చిత్రాన్ని ధమాకా రచయిత ప్రసన్న కుమార్ తో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున సరసన జోడిగా 2020 మిస్ ఇండియా మానస వారణాసి కనిపించనుంది అని సమాచారం. దీనికి సంబంధించిన వార్తను మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఈ బిగ్గీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది అని లేటెస్ట్ టాక్. మలయాళ హిట్ మూవీకి అఫీషియల్ రీమేక్ అయిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.