కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా "రంగమార్తాండ". ఇప్పటివరకు ఈ సినిమా నుండి నాలుగు పాటలు విడుదలయ్యాయి. అన్నిటికీ కూడా ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ప్రతి ఒక్కపాటతో ఆడియన్స్ లో అంచనాలు పెంచుతున్న ఈ సినిమా విడుదల కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే, రంగమార్తాండ ప్రమోషనల్ కంటెంట్ కి వస్తున్న సూపర్బ్ రెస్పాన్స్ కి చిత్రబృందం అభిమానులకు శుభాకాంక్షలను తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa