ఈ రోజు శుక్రవారం.. సో, సోని లివ్ ఓటిటిలో 'నిజం విత్ స్మిత' టాక్ షో యొక్క న్యూ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుంది కదా. లేటెస్ట్ ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నాని, విలక్షణ నటుడు రానా హాజరయ్యారు. వారసత్వం - వారి తత్త్వం అంశంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ నెపోటిజం పై చాలా చక్కటి అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. నాని మొదటి సినిమా లక్షమంది చూసారు. చరణ్ మొదటి సినిమా కోటి మంది చూసారు.. చూసినవాళ్లు కదా నెపోటిజంని ఎంకరేజ్ చేస్తుంది... అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ చిన్న వీడియో క్లిప్ ని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ.. నిజమే కదా అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa