'జబర్దస్త్' ఫేమ్ వేణు టిల్లు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "బలగం". ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ విడుదలయ్యింది. ఈ మేరకు మార్చి 3న బలగం మూవీ థియేటర్లలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం బలగం ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa