యంగ్ హీరో ఆది పినిశెట్టి ప్రస్తుతం "శబ్దం" సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆది కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'వైశాలి' దర్శకుడు అరివాజగన్ వెంకటాచలం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ టైటిల్ పోస్టర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. హార్రర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. 7జి ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా లక్ష్మి మీనన్ నటిస్తుందని పేర్కొంటూ కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa