ఫణిదీప్ దర్శకత్వంలో యంగ్ హీరో హీరోయిన్లు శ్రీసింహ, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న చిత్రం "ఉస్తాద్". వారాహి చలనచిత్రం, కృషి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీకి అకీవా సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుండి ఇటీవలే శ్రీసింహ క్యారెక్టర్ పోస్టర్ ని విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విలక్షణ నటుడు గౌతమ్ మీనన్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ కెప్టెన్ జోసెఫ్ డిసౌజా పాత్రలో సీనియర్ పైలట్ గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa