పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన "భీమ్లానాయక్" విడుదలై ఈ రోజుతో ఏడాది పూర్తవుతుంది. నిరుడు సరిగ్గా ఇదే రోజు థియేటర్లకొచ్చిన భీమ్లానాయక్ కి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షుకులు బ్రహ్మరథం పట్టారు. రీ ఎంట్రీ తదుపరి పవన్ కళ్యాణ్ అందుకున్న సాలిడ్ అండ్ మేజర్ హిట్ ఈ సినిమానే.
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa