గత శనివారం విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం సూపర్ హిట్ టాక్ తో హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది. కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మల్టీ జానర్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తాజాగా విజయవంతంగా రెండవ వారంలోకి అడుగు పెట్టింది. రెండో వారంలో కూడా సినిమా టికెట్లు సూపర్ ఫాస్ట్ గా బుక్ అవుతున్నాయని చిత్రబృందం పేర్కొంది.
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటించారు. బన్నీ వాసు నిర్మించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa