పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన గత వారంలోనే జరిగింది. దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
ఐతే, ఈ సినిమాలో పవన్ మరియు తేజ్ లపై ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. తాజా బజ్ ప్రకారం, ఈ స్పెషల్ సాంగ్ లో ఈ ఇద్దరు మెగా హీరోలతో కలిసి ధమాకా బ్యూటీ శ్రీలీల చిందేయ్యబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ నుండి త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.
థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa