నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ "వీరసింహారెడ్డి" ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీరసింహారెడ్డి హంగామా యాంథెం ని విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్, విజయవాడ లలో బాలకృష్ణ అభిమానుల కోలాహలం నడుమ వీరసింహారెడ్డి హంగామా యాంథెం విడుదలయ్యింది.