పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం టెంపర్ . ఈ సినిమా హిందీలో సింబా పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తమిళంలో రీమేక్ అవుతుంది. నవ దర్శకుడు, ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.ఆయన సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. అయోగ్య అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయోగ్య చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలో చిత్ర విడుదలకి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పాటలో విశాల్‌తో కలిసి సన్నీ ఆడిపాడిందట. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. సన్నీ ప్రస్తుతం ‘వీరమాదేవి’ అనే చారిత్రాత్మక చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa