ఎఫ్ 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త మూవీకి శ్రీకారం చుట్టాడు.. యాక్షన్ తో పాటు వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హరీష్ శంకర్ ఈ మూవీకి దర్శకుడు.. ఈ మూవీకి వాల్మికి టైటిల్ ను ఖరారు చేశారు.. తమిళంలో సూపర్ హిట్ చిత్రం జిగర్తాండ్రా చిత్రానికి రీమేక్ ఇది. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రని తెలుగులో వరుణ్ తేజ్ చేయనున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు.. అనంతరం ఈ మూవీ తొలి షాట్ కు వరుణ్ సోదరి నిహారిక క్లాప్ ఇచ్చింది..వివి వినాయక్, సుకుమార్ , దిల్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa