మాస్ రాజా రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా, నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో రూపొందిన పక్కా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ "ధమాకా". భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. డిసెంబర్ 23వ తేదీన ధియేటర్లకొచ్చిన ధమాకా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధమఖేదర్ వసూళ్లను రాబడుతుంది. రవితేజ కెరీర్ లో ఫస్ట్ 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మెమొరబుల్ మూవీగా నిలిచింది.
ఈ సినిమా నుండి రీసెంట్గా విడుదలైన వాట్స్ హ్యాపెనింగ్ వీడియో సాంగ్ తాజాగా యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ ని చేరుకుంది. రమ్యబెహరా, భార్గవి పిళ్ళై ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి గారు మోడరన్ క్యాచీ లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa