టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వివాహ భోజనంబు ఫేమ్ దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి ఒక చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'సమాజవరగమన' అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ఈరోజు శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో గ్లింప్సె ని విడుదల చేసారు. ఈ సినిమా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని వీడియో గ్లింప్సె హామీ ఇస్తుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ అండ్ గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫన్ పార్ట్ ని ఎలివేట్ చేసింది.
నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి కెమెరా క్రాంక్ చేస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa