నటి చౌరాసియా మరోసారి వార్తలోకి ఎక్కింది. కేబీఆర్ పార్కులో తనను ఓ యువకుడు వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాకింగ్ చేస్తుంటే వెంట పడ్డాడని పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి, ఆమె వెంట ఎవరూ పడలేదని తేల్చారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ వ్యవహారంలో చౌరాసియాకు కౌన్సిలింగ్ చేసి పంపించారు. కాగా 2021లోనూ ఇదే తరహాలో దాడి జరిగిందని ఆమె ఫిర్యాదు చేయగా అప్పట్లో కలకలం రేపింది.