కొన్ని రోజుల క్రితం, హారర్ కామెడీ ఫ్రాంచైజీ అరణ్మనై యొక్క నాల్గవ చిత్రం 'అరణ్మనని' నుండి బహుముఖ నటుడు విజయ్ సేతుపతి డేట్స్ కారణంగా తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మరో ఆసక్తికర వార్త హల్ చల్ చేస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బెంగాల్ టైగర్ బ్యూటీస్ రాశి ఖన్నా మరియు తమన్నా భాటియా ఈ సినిమా యొక్క నాల్గవ భాగంలో కలిసి స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇంకా ఏమీ కన్ఫర్మ్ కానప్పటికీ ఈ చిత్రంలో ఈ ఇద్దరు నటీమణులు ఉన్నారనే వార్త ఇపుడు వైరల్‌గా మారింది.
మూడో భాగం అరణ్మనై 3లో రాశి మహిళా ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఫ్రాంచైజీ దర్శకుడు సుందర్ సి ఈ నాలుగో భాగంలో కథానాయకుడిగా నటించే అవకాశం ఉంది అని లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa